న్యూ ఇయర్ మహేష్ సూపర్ గిఫ్ట్..!

December 06, 2017


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు భరత్ అను నేను టైటిల్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు అయితే టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో న్యూ ఇయర్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడట మహేష్. శ్రీమంతుడు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మహేష్ సిఎంగా కనిపిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మహేష్ ను హిట్ ట్రాక్ ఎక్కించడం పక్కా అని అంటున్నారు. న్యూ ఇయర్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన మహేష్ సినిమా టైటిల్ ఏంటన్నది కూడా ఆరోజు ఫిక్స్ అవుతుంది. ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా ఆరోజే 2.0 కూడా రిలీజ్ ఉంటుందని మహేష్ సినిమా రిలీజ్ పై మళ్లీ ఆలోచనలో పడ్డారు.Related Post

సినిమా స‌మీక్ష