ఓటర్ గా విష్ణు.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్..!

November 23, 2017


img

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేం కార్తిక్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఓటర్. ఓటర్ పవర్ ఏంటో చూపించేలా రాబోతున్న ఈ సినిమా కాన్సెప్ట్ అదరిపోతుందట. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విష్ణు సీరియస్ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇన్నాళ్లు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విష్ణు ఓటర్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది.

తెలుగు పోస్టర్ లో సిని రాజకీయ ప్రముఖుల ఫోటోలతో పోస్టర్ డిజైన్ చేయగా తమిళ పోస్టర్ కూడా అదే విధంగా డిజైన్ చేశారు. ఓటర్ సత్తా ఏంటో చూపించేలా రాబోతున్న ఈ సినిమా పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. విష్ణు బర్త్ డే కానుకగా వచ్చిన ఈ ఓటర్ పోస్టర్ తనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సైలెంట్ గా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ చేయనున్నారట.



Related Post

సినిమా స‌మీక్ష