సవ్యసాచి ఫస్ట్ లుక్ అదుర్స్..!

November 22, 2017


img

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు నాగ చైతన్య బర్త్ డే కానుకగా ఈరోజు రిలీజ్ చేశారు. సవ్యసాచి ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య సీరియస్ లుక్ అదిరిపోయింది. ప్రేమమ్ తో రీమేక్ అయినా హిట్ అనిపించేలా చేసిన చందు సవ్యసాచిగా హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. 


కోలీవుడ్ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో స్పెషల్ క్యారక్టర్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ మాత్రం కచ్చితంగా సినిమా కంటెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. చైతు ఇంటెన్స్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. యుద్ధం శరణం తర్వాత చైతు చేస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో రాబోతుందట.



Related Post

సినిమా స‌మీక్ష