ఆ సినిమాకు కొరటాల సపోర్ట్

November 22, 2017


img

సాయి ధరం తేజ్ హీరోగా బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న సినిమా జవాన్. డిసెంబర్ 1న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ సినిమాలో కొరటాల శివ ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని తెలుస్తుంది. రచయితగా బివిఎస్ రవి సినిమాలకు పనిచేస్తున్న టైంలోనే కొరటాల శివ కూడా రచయితగా కొనసాగాడు.

ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో రవికి సక్సెస్ అందించే ఆలోచనలో సినిమాకు తన సలహాలు అందించాడట. జవాన్ సినిమా రీషూట్ల పర్యంతం కాగా సినిమాకు శివ సపోర్ట్ అందించాడట. దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హ్యాండ్ గా ఉన్న మెహ్రీన్ కౌర్ జవాన్ సినిమాకు కలిసి వస్తుందో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష