పవన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

November 21, 2017


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అంటూ కన్ఫాం చేశారు సిని వర్గాలు. అయితే అఫిషియల్ ఫస్ట్ లుక్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ఇక దానికి ముహుర్తం పెట్టేశారని చిత్రయూనిట్ చెబుతుంది. నవంబర్ 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారట.  

ఇక సినిమాను కూడా అనుకున్న విధంగా జనవరి 10న వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భధ్రత దృష్ట్యా తెలుగు రెండు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోస్ వేయడం ఆపేశారు. అందుకే జనవరి 9న సెకండ్ షో నుండి అజ్ఞాతవాసిని రిలీజ్ చేస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటుగా అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష