శాటిలైట్ లో దమ్ము చూపించాడు..!

November 21, 2017


img

పిఎస్వి గరుడవేగ అంటూ యాంగ్రీ యంగ్ మ్యాన్ తన సత్తా ఏంటో చూపించేశాడు. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. మొదటి షో నుండి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లగా యూఎస్ లో ఈ సినిమా కోటిన్నర దాకా కలక్షన్స్ కుమ్మేసింది. ఇక శాటిలైట్ రైట్స్ లో కూడా గరుడవేగ సినిమా రికార్డ్ ప్రైజ్ లో అమ్ముడయ్యింది. మార్కెట్ ముగిసింది అనుకున్న రాజశేఖర్ కు సినిమా పాజిటివ్ టాక్ రావడమే కాదు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ లో కూడా ప్రముఖ ఛానెల్స్ పోటీ పడ్డాయట. ఫైనల్ గా జెమిని టివి 4 కోట్లకు గరుడవేగ రైట్స్ ను సొంతం చేసుకున్నాయని తెలుస్తుంది. రాజశేఖర్ సినిమా ఈ రేంజ్ శాటిలైట్ అంటే కచ్చితంగా రికార్డ్ అన్నట్టే. ఇక సినిమా రీమేక్, డబ్బింగ్ రైట్స్ లో కూడా భారీగానే డిమాండ్ చేస్తుందట. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రాజశేఖర్ కెరియర్ మళ్లీ సెట్ రైట్ అయ్యింది.



Related Post

సినిమా స‌మీక్ష