మిర్చీ పాప గరం గరం..!

November 21, 2017


img

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. లీడర్ లో అలరించి కొరటాల శివ ప్రభాస్ కాంబోలో వచ్చిన  మిర్చి సినిమాలో నటించిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ గురించి తెలియనివారు ఉండరు. అమాయకంగా తన ఓరచూపులతో అందరి మనసు కట్టిపడేసిన ఈ అమ్మడు రహస్యంగా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.  

ఆ మద్య వరుసగా అవకాశాలు వచ్చినా ఈ అమ్మడు అవేవీ పట్టించుకోకుండా అమెరికాలోని వాషింగ్టన్‌లో సెటిల్ అయ్యింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకునే అక్కడే సెటిలైపోయిందంటూ.. ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై రిచా ఘాటుగానే స్పందించింది. మీ కోసం ఇక్కడ స్పష్టత ఇస్తున్నా.. నేను పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకుంటే తప్పకుండా నేనే చెబుతాను అని అంటుంది.   

అంతేకాదు తెలుగు మీడియా నా బోరింగ్ లైఫ్ చూసి నిరుత్సాహపడుతున్నట్లుంది. అందుకే మసాలాలను యాడ్ చేస్తుంది. దయచేసి సినిమాల నుంచి రిటైరైన నటుల జీవితాలను వదిలి.. ప్రస్తుతం నడుస్తున్న సినిమా వార్తలపై దృష్టి పెట్టండి అని ఫైర్ అయ్యింది రిచా.       



Related Post

సినిమా స‌మీక్ష