ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్న సింగర్..!

November 21, 2017


img

ఈ మద్య టాలీవుడ్ లో సింగర్లు తమ అందమైన స్వరాలతోనే కాకుండా సౌందర్యంతో కూడా ఫ్యాన్స్ మనసు దోచేస్తున్నారు. ఇక తెలుగు లో అందమైన సింగర్లు ఎవరూ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సునిత. పేరుకు సింగర్ అయినా..  ఆమెకుండే గ్లామర్ ను బట్టి పదింతల పాపులారిటీ కొట్టేసింది. కేవలం సింగర్ గానే కాకుండా బుల్లితెరపై యాంకర్ గా, కొన్ని రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమె పాట కూడా అంతే. మత్తు, మాధుర్యం సమపాళ్లలో పలికిస్తుందంటూ కాంప్లిమెంట్స్ వున్నాయి. అందుకే.. సునీతని సింపుల్ గా స్వర సౌందర్య అంటూ పిలుచుకుంటారు ఆమె ఫ్యాన్స్. 

ఆ మద్య తన లైఫ్ లో కొన్ని బాధలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ధైర్యంగా బతుకుతున్నా అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది సునిత. తాజాగా ఈ అమ్మడు ఫ్యాన్స్ పై కోపంగా ఉంది.. ఆమె పేరు మీద సామాజిక మాధ్యమాల్లో అనేక మంది ఖాతాలు తెరిచేశారట. ఎవరికివారు ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారట. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయింది. ఫేస్ బుక్ లో నాకు ఒకే అకౌంట్ ఉంది. దానికి నీలం రంగు టిక్ ఉంటుంది. దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి.. మిగతా ఏ అకొంట్ నాది కాదు వాటిలో పెట్టే పోస్టులు తనవి కావు అంటూ వేడుకుంటోంది సునీత. 



Related Post

సినిమా స‌మీక్ష