గరుడవేగ రివ్యూ & రేటింగ్

November 04, 2017


img

రేటింగ్ : 3/5

కథ :

ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ (రాజశేఖర్) హైదరాబాద్ సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరుగబోతుందని కనిపెడతాడు. ఇక ఆ బాంబ్ బ్లాస్ట్ ఆపడానికి ప్రయత్నించే క్రమంలో తనకు దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇక తన టీంతో కలిసి ఆ మిషన్ ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇంతకీ చంద్రశేఖర్ కనిపెట్టిన మిషన్ ఏంటి..? దాని ఎవరు ఎందుకు చేస్తున్నారు..? దాని వలన కలిగే నష్టం ఏంటి అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

రొటీన్ లవ్ స్టోరీ,  చందమామ కథలు, గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు నుండి కచ్చితంగా గరుడవేగ లాంటి సినిమా ఊహించరు. ఒకవేళ ఊహించినా ఇంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ మాత్రం కొద్ది కష్టమే. సినిమాలో ప్రతి ఒక్క అంశానికి ఓ ప్లాన్ ప్రకారం వెళ్లాడు దర్శకుడు. అందుకు దర్శకుడికి కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

స్పై థ్రిల్లర్ గా ఎంచుకున్న కథకు.. ఉన్న బడ్జెట్ కు అన్నివిధాలుగా న్యాయం చేశారు. మొదటి భాగం అంతా రేసీగా నడువగా సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. అయినా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సినిమా సక్సెస్ అయ్యింది. రాజశేఖర్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేస్తాడని అసలు ఎవరు ఊహించరు. కచ్చితంగా ఇది రాజశేఖర్ కు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. సినిమాలో కమర్షియల్ హంగుల కోసం కథను కథనాన్ని పక్క దారి పట్టించకుండా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. 

ముఖ్యంగా సినిమాలో ప్రవీణ్ సత్తారు టేకింగ్ బాగుంది. కెమెరా మన్ ను వాడుకున్న విధానం బాగుంటుంది. స్పై థ్రిల్లర్ గా లిమిటెడ్ బడ్జెట్ తో అయినా దానికి తగ్గట్టుగానే మంచి హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో వచ్చింది ఈ గరుడవేగ. అయితే సినిమా అంతా స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడుస్తుండటంతో బి, సి సెంటర్స్ ఆడియెన్స్ కొంచం కనెక్ట్ అవడం లేటు పడుతుంది. మిగతా సినిమా అంతా బాగుంది.

నటన, సాంకేతిక వర్గం :

ఎవడైతే నాకేంటి తర్వాత హిట్ కోసం తపిస్తున్న రాజశేఖర్ అలాంటి పకడ్బందీ కథతో ఈ గరుడవేగ తీశారు. సినిమాలో ఐ.ఐ.ఏ ఏజెంట్ గా మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు రాజశేఖర్. సినిమాలో ఆయన నటన అన్నిటికన్నా హైలెట్. ఇక విలన్ కిశోర్ పాత్ర బాగుంటుంది. అయితే అతన్ని పాత్ర నిడివి తవ్వువ ఉన్నట్టు అనిపిస్తుంది. పూజా కుమార్ పాత్ర కూడా చాలా చిన్నదే అయినా మెప్పించింది. ఆదిత్ పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. నిరంజన్ పాత్రలో అతను మంచి అభినయం కనబరిచాడు. ఇక రవివర్మ, చరణ్ దీప్ లు ఓకే అనేలా చేశారు. సన్ని లియోన్ ఐటం సాంగ్ పర్వాలేదు. శ్రద్ధ దాస్ రిపోర్టర్ గా కనిపించి అలరించింది. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. ముందుగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథ కథనాలు తెలుగు పరిశ్రమకు ఓ కొత్త స్పై థ్రిల్లర్ పరిచయం చేశాడు. కథ కథనాల్లో క్లారిటీ ఎక్కడ మిస్ అవలేదు. అయితే కథనంలో కొంచం ఆడియెన్స్ ను కన్ ఫ్యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. శ్రీ చరణ్, భీమ్స్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా మన్ వర్క్ చాలా బాగుంది. సినిమా ఓపెనింగ్ లో తీసే చేజింగ్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరమీద కనిపిస్తుంది.  

ఒక్కమాటలో :

రొటీన్ కు భిన్నంగా తెలుగు స్పై థ్రిల్లర్ గా వచ్చిన పిఎస్వి గరుడవేగ రాజశేఖర్ మార్క్ సినిమాగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష