రంగస్థలంలో అనసూయ పాత్ర ఇదే..!

September 25, 2017


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం 1985 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఇక సినిమాలో క్రేజీ యాంకర్ అనసూయ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. సినిమాలో ఆమె ఐటం సాంగ్ చేస్తుందని అనుకోగా ఇప్పుడు అనసూయ రోల్ ఇది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తుంది. 

పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ రంగస్థలం మూవీలో అనసూయ చరణ్ కు మేనత్త పాత్రలో నటిస్తుందట. తన బుల్లితెర షోలతో ప్రేక్షకులను ఫిదా చేసే ఈ అమ్మడు చరణ్ కు మేనత్తగా ఎలా ఉండబోతుందో చూడాలి. మొన్నామధ్య తన కాళ్ల వరకు పిక్ తీసి ట్విట్టర్ లో పెట్టిన ఈ అమ్మడు సినిమాలో తన లుక్ ఎప్పుడు రివీల్ చేస్తుందో అని ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

 


Related Post

సినిమా స‌మీక్ష