ఫిదా సంచలనాలు కొనసాగుతున్నాయ్..!

September 23, 2017


img

వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఫిదా.. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు గడిచినా సరే ఇంకా ఫిదా రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాలో ముఖ్యంగా సాంగ్స్ క్రేజ్ మాములుగా లేదు. కార్తిక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో వచ్చిందే పిల్లా మెల్లగ వచ్చిండే అంటూ వచ్చిన సాంగ్ అదరగొట్టింది.

ఇక అదే కాకుండా హేయ్ పిల్లగాడా సాంగ్ కూడా సాయి పల్లవి అభినయానికి ఇంప్రెస్ అయ్యారు. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా నుండి వచ్చిన హేయ్ పిల్లగాడా సాంగ్ 24 గంటల్లో 9 లక్షలకు పైగా వ్యూయర్ కౌంట్ తో సంచలనం సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి ఇన్నిరోజులు అవుతున్నా సరే ఫిదా క్రేజ్ ఈ రేంజ్ లో ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 





Related Post

సినిమా స‌మీక్ష