బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే..!

September 23, 2017


img

70 రోజుల పాటుగా బిగ్ బాస్ హౌజ్ లో ఉంటున్న హౌజ్ మెట్స్ ఈవారంతో ఆ రియాలిటీ షో అయిపోవడంతో ఫైనల్ విన్నర్ ఎవరు అన్నది ఎనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురు కంటెస్టంట్స్ లో నవదీప్, హరితేజ, శివబాలాజి, ఆదర్శ్, అర్చనలలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అవుతారు అన్న ఎక్సయిట్మెంట్ ఏర్పడింది. ఇక చివరి ఎపిసోడ్ అదేనండి ఫైనల్ విన్నర్ ను ఎనౌన్స్ చేసే ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టంట్స్ 14మంది షోలో పాల్గొంటారట. 

ఇక విన్నర్ సెలక్షన్ కూడా అంచనాలకు అందకుండా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఫైనల్ విన్నర్లుగా శివ బాలాజి, హరితేజ పేర్లు వినిపిస్తున్నాయి. నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి అతనికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆదర్శ్ కూడా బిగ్ బాస్ విన్నర్ అవబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ ను ఈరోజే షూట్ చేసేస్తారట. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ విన్నర్ ఎవరు అన్నది రేపటితో తేలిపోతుంది.



Related Post

సినిమా స‌మీక్ష