పి.ఎస్.వి గరుడవేగ టీజర్..!

September 22, 2017


img

ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో డాక్టర్ రాజశేఖర్ హీరోగా వస్తున్న సినిమా పి.ఎస్.వి గరుడవేగ. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సిని ప్రేక్షకులను అలరిస్తుంది. 6 కోట్ల టీజర్ తో మొదలైన ఈ సినిమా 25 కోట్ల సినిమా దాకా వెళ్లిందంటే సినిమా రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. విజువల్స్ పరంగా సినిమా ఓ హాలీవుడ్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా టీజర్ ను దగ్గుబాటి రానా, లక్ష్మి మంచు, తాప్సీ కలిసి రిలీజ్ చేశారు.   

సినిమా రిచ్ నెస్ ఏంటో టీజర్ చూస్తే తెలుస్తుంది. పూజా కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ ఓ ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు గుంటూర్ టాకీస్ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరు ఊహించి ఉండరు. టీజర్ తో అలరించిన ఈ సినిమా రాజశేఖర్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించేలా చేస్తుందని చెప్పొచ్చు. సన్నీ లియోన్ ఐటం సాంగ్ చేస్తున్న ఈ సినిమా స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు. సినిమా కంటెంట్ ఏంటి అన్నది చెప్పలేదు కాని టీజర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. 




Related Post

సినిమా స‌మీక్ష