ఆ సీక్వెల్ లో తారక్ నటిస్తాడా..?

September 13, 2017


img

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా గుర్తుంది కదా. ఈ మూవీ కూడా తారక్ కెరీర్ లో ఓ ముఖ్యమైనదని చెప్పొచ్చు. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీ భారీగానే కాసులు మూటగట్టుకుంది. ఆ తర్వాత చాలాసార్లు టీవీల్లో కూడా ప్రదర్శితమై సక్సెస్ సాధించింది. 

ఎన్నిసార్లు స్మాల్ స్క్రీన్ మీద ప్లే అయినా కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో రేటింగ్ కూడా బాగానే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై మరోసారి వినాయక్ కన్నేశాడు. తాజాగా దీనికి సీక్వెల్ చేయాలని కసరత్తు చేస్తున్నాడట. ఇందులో భాగంగానే రైటర్ కోనా వెంకట్ కి స్టోరీ రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చేశాడట. 

ప్రెజెంట్ కోన వెంకట్ అదే పనిలో ఉన్నాడని సమాచారం. కొన్ని రోజుల క్రితం అదుర్స్ సీక్వెల్ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. కాని ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్డ్ గా లేడని టాక్. ఇటీవలి కాలంలో తారక్ సినిమా సినిమాకి భిన్నమైన కథనాలు ఎంచుకుంటున్నారు. అందువల్ల ఈ మూవీ సీక్వెల్ కి ఒకే చెప్పకపోవచ్చని టాక్.Related Post

సినిమా స‌మీక్ష