యూఎస్ బాక్సాఫీస్.. టాప్ టెన్ లో అర్జున్ రెడ్డి..!

September 11, 2017


img

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. రిలీజ్ ముందు ముద్దు పోస్టర్స్ తో నెగటివ్ ప్రమోషన్స్ వచ్చినా రిలీజ్ తర్వాత మాత్రం ఆ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో యూఎస్ బాక్సాఫీస్ పై అర్జున్ రెడ్డి ప్రభావం ఓ రేంజ్ లో కనబడుతుంది. సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ మార్క్ దాటేసిన అర్జున్ రెడ్డి యూఎస్ లో సూపర్ హిట్ అయిన సినిమాల లిస్త్ లో టాప్ 10 లో స్థానం సంపాదించింది.

బాహుబలి-2 మొదటి స్థానంలో ఉండగా బాహుబలి, శ్రీమంతుడు, అఆ, ఖైది నంబర్ 150, ఫిదా, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్ సినిమాలు మొదటి 9 స్థానాల్లో ఉండగా మొన్నటిదాకా శాతకర్ణి 10వ స్థానంలో ఉంది అర్జున్ రెడ్డి ఆ సినిమాను క్రాస్ చేసి 1.682 డాలర్ల కలక్షన్స్ తో 10వ ప్లేస్ లో స్థానం దక్కించుకుంది. ఇక ఫుల్ రన్లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అదే జరిగితే యూఎస్ లో విజయ్ సినిమా అంటే స్టార్ రేంజ్ అందుకున్నట్టే లెక్క.

 


Related Post

సినిమా స‌మీక్ష