స్పైడర్ అక్కడ దుమ్ముదులిపేస్తుంది..!

July 25, 2017


img

మహేష్ మురుగదాస్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా స్పైడర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమా తమిళ రైట్స్ భారీ రేంజ్ లో అమ్ముడయ్యాయని తెలుస్తుంది. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ అయిన లైకా ప్రొడక్షన్స్ స్పైడర్ తమిళ రైట్స్ కొనడం విశేషం.

టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేయగా ఆ అంచనాలతోనే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా స్పైడర్ అదరగొడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ తమిళ రైట్స్ ను 23 కోట్లకు కొనేసిందట. ఓ తెలుగు హీరో సినిమా తమిళంలో ఈ రేంజ్ లో అమ్ముడవడం మాములు విషయం కాదు. అక్కడ మార్కెట్ పై కన్నేసిన మహేష్ స్పైడర్ తో అక్కడ తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. మరి స్పైడర్ తో మహేష్ తమిళ నాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష