ఫిదా రివ్యూ & రేటింగ్

July 21, 2017


img

రేటింగ్ : 2.75/5

కథ :

అమెరికాలో మెడిసిన్ చేస్తున్న వరుణ్ (వరుణ్ తేజ్) అన్నయ్య పెళ్లి గురించి భాన్సువాడ వస్తాడు. అక్కడ పెళ్లి కూతురు చెల్లి భానుమతి (సాయి పల్లవి)తో పరిచయం పెంచుకుంటాడు. మొదట వరుణ్ గురించి నెగటివ్ గా ఆలోచించిన భానుమతి ఆ తర్వాత అతన్ని ప్రేమిస్తుంది. ఈ విషయం చెబుదామనుకునే సరికి అతని గురించి కొన్ని అనుమానాలు వస్తాయి. అవే ఇద్దరు దూరమయ్యేలా చేస్తాయి. అసలు వరుణ్ ను భానుమతి ఎందుకు దూరం పెడుతుంది..? వరుణ్, భానుమతిల ప్రేమ సక్సెస్ అయ్యిందా..? ఇద్దరు ఎలా కలిశారు అన్నది అసలు కథ.

విశ్లేషణ :

హ్యాపీడేస్ తరహాలో ఓ మంచి జీవిత కథను చెప్పిన శేఖర్ కమ్ముల తన ప్రతి సినిమాలో కచ్చితంగా రియాలిటీకి దగ్గరగా ఉండే పాయింట్ ను తీసుకుంటాడు. అలానే ఫిదా మూవీలో కూడా ఊరు.. తండ్రి అంటే ప్రాణమనుకునే గడుసు అమ్మాయి అక్క పెళ్లి చేసుకోగా అతని తమ్ముడు భానుమతిని ప్రేమిస్తాడు.. అతని క్యారక్టర్ బ్యాడ్ అని దూరం పెట్టినా మనసులో అతని మీద ఇష్టం చావదు. 

ఇక పెళ్లి చేసుకున్నా తనతో పాటుగా తన ఊరిలో తన ఇంట్లోనే ఉండిపోతాడా అని డౌట్.. ఆమె మీద ప్రేమతో హీరో దానికి ఒప్పుకుంటాడు అదే శేఖర్ కమ్ముల ఫిదా కథ. కథ చెప్పడానికి పాతదే అయినా కథనం నడిపించిన తీరు చాలా బాగుంటుంది. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అని స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి ట్విస్టులు.. ఎలాంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా మనసుకి ఉల్లసాన్ని కలిగిస్తూ కథనం నడిపించేశాడు.

అయితే ఫస్ట్ హాఫ్ కాస్త హుశారుగా నడిపించిన శేఖర్ కమ్ముల సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాంగ్ చేశాడని అనుకోవచ్చు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. లీడ్ పెయిర్ అదరగొట్టినా ఎక్కువ మోతాదు హీరోయిన్ కే చెల్లిందని అనుకోవచ్చు. ఓవరాల్ గా ప్రేమ కోసం ప్రేయసి కోసం ఆమె దగ్గరకే వచ్చేందుకు ఒప్పుకునే ఫిదా కథ అందరిని ఫిదా చేస్తుంది.

నటన, సాంకేతిక వర్గం : 

సినిమాలో వరుణ్ తేజ్ నటన పర్వాలేదు కాని ఎమొషనల్ సీన్స్ లో తేలగొట్టాడని చెప్పాలి. ఫీల్ అవసరమైన చోట వరుణ్ ఇంకాస్త ఎక్కువ కష్టపడితే బాగుండేది. ఇక భానుమతిగా చేసిన సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమా మొత్తం ఆమె నటన అదరగొట్టేసింది. ప్రేమం తోనే సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఈ సినిమాతో మరింత దగ్గరవుతుందని చెప్పొచ్చు. సత్యం రాజేష్ చేసిన కొన్ని సీన్స్ ఓకే అనిపించాడు. వరుణ్ అన్న వదినలుగా చేసిన వారు కూడా బాగానే చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల రొటీన్ కథ అయినా కథనం నడిపించిన తీరు అందరికి నచ్చుతుంది. తన మార్క్ మాత్రం పక్కాగా కనిపించేలా చేశాడు శేఖర్ కమ్ముల. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా బాగా దృష్టి పెట్టారు. ఇక ఎడిటింగ్ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. 

ఒక్కమాటలో :

శేఖర్ కమ్ముల మార్క్ ఫిదా.. వరుణ్, సాయి పల్లవి అదరగొట్టేశారు..!


Related Post

సినిమా స‌మీక్ష