శ్రీను వైట్లకు పవన్ అభయం ఇస్తాడా..?

April 19, 2017


img

కామెడీ ఎంటర్టైన్ మెంట్ ను కమర్షియల్ పంథాలో చెప్పేందుకు సరికొత్త మార్గాన్ని చూపించిన దర్శకుడు శ్రీనువైట్ల. అయితే తన హిట్ ఫార్ములాను ప్రతి సినిమాలో కంటిన్యూ చేస్తూ చివరకు ఫ్లాప్ డైరక్టర్ అనే ముద్ర వేసుకున్నాడు శ్రీనువైట్ల. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ మిస్టర్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక తర్వాత సినిమా కొత్తవారితో తప్ప హీరోలెవరు శ్రీనువైట్లను నమ్మి ఓకే చెప్పరని టాక్ కూడా వచ్చింది.    

అయితే ఇలాంటి స్టేజ్ లో తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ అనుకున్నానని.. పవన్ ఛాన్స్ ఇస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా అంటున్నాడు శ్రీనువైట్ల. ఫ్లాపుల్లో ఉన్న తనని పవన్ కళ్యాణ్ మెచ్చుతాడా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ప్రస్తుతం వరుసెంట సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ త్రివిక్రంతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. మరి పవర్ స్టార్ నే మెప్పించే సబ్జెక్ట్ నిజంగా శ్రీనువైట్ల దగ్గర ఉందా అంటున్నారు. పవన్ కనుక శ్రీనువైట్ల నేరేషన్ కు కన్విన్స్ అయితే అభయం ఇచ్చినా ఇచ్చేస్తాడని అంటున్నారు. మరి శ్రీనువైట్ల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతాయో చూడాలి.    



Related Post

సినిమా స‌మీక్ష