తమిళ దర్శకుడితో ఇస్మార్ట్ హీరో..!

January 23, 2021


img

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ కాస్త ఉస్తాద్ రామ్ పోతినేని అని స్క్రీన్ నేం కూడా మార్చుకున్నాడు. ఈమధ్య వచ్చిన రెడ్ కూడా హిట్ అవడంతో రామ్ సూపర్ జోష్ లో ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం తో ఉంటుందని తెలుస్తుండగా.. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ తో సినిమా తర్వాత రామ్ తో చేస్తాడని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా రామ్ కోలీవుడ్ డైరక్టర్ నేసన్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ నేసన్ వచ్చి రామ్ కు కథ వినిపించడం.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇన్నాళ్లు కెరియర్ లో అటు ఇటుగా ఉన్న రామ్ తనని ఆడియెన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో పర్ఫెక్ట్ పిక్చర్ అర్ధమైంది. అందుకే రామ్ ఇక మీదట తానేంటో చూపిస్తా అని అంటున్నాడు. ఎలాగు త్రివిక్రంతో చేసే సినిమా క్లాస్ గా ఉంటుంది కాబట్టి నేసన్ తో కూడా యాక్షన్ సినిమాతోనే వస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.     



Related Post

సినిమా స‌మీక్ష