టైటిలే కాదు సాంగ్ కూడానా..?

January 20, 2021


img

నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ బంగారు బుల్లోడు. అదే టైటిల్ తో అల్లరి నరేష్ వస్తున్నాడు. బాలయ్య టైటిల్ తో నూతన ఉత్సాహంతో వస్తున్న అల్లరి నరేష్ ఈ బంగారు బుల్లోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. గిరి డైరక్షన్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్య టైటిల్ ను మాత్రమే కాదు బంగారు బుల్లోడు సినిమాలో సూపర్ హిట్ సాంగ్ స్వాతిలో ముత్యమంత సాంగ్ ను వాడేశారు.

రాజ్ కోటి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఆ సూపర్ హిట్ సాంగ్ ను ఈ బంగారు బుల్లోడు కోసం రీమిక్స్ చేశారు. సాయి కార్తిక్ ఈ రీమిక్స్ సాంగ్ కు మ్యూజిక్ అందించారు. లిరిక్స్ అలానే ఉంచినా మ్యూజిక్ కొద్దిగా మార్చి సాంగ్ ఫీల్ అలానే ఉండేలా చేశారు. మొత్తానికి బాలయ్య టైటిల్ తోనే కాదు సూపర్ హిట్ సాంగ్ తో కూడా అల్లరి నరేష్ సినిమాను నందమూరి ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యేలా చేస్తున్నాడు. ఈ నెల 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అల్లరోడు భారీ హోప్స్ పెట్టుకున్నాడు.





Related Post

సినిమా స‌మీక్ష