మరో కొరియన్ మూవీ పట్టేసిన సురేష్ బాబు..!

January 20, 2021


img

సురేష్ ప్రొడక్షన్ లో మరో సూపర్ హిట్ మూవీ రాబోతుంది. సినిమా మొదలవకముందే అది సూపర్ హిట్ అనేస్తే ఎలా అనుకోవచ్చు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో త్వరలో ఓ సినిమా మొదలవనుంది. అది కొరియన్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా వస్తుంది. కొరియన్ మూవీ రీమేక్ గా వస్తున్న తెలుగు సినిమాలన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే సురేష్ బాబు చేయబోతున్న ఈ సినిమా కూడా పక్కా హిట్ అని చెప్పొచ్చు. ఇంతకీ సురేష్ ప్రొడక్షన్ లో వచ్చే ఆ కొరియన్ మూవీ ఏది అంటే లక్ కీ. కీ ఆఫ్ లైఫ్ అనే జపనీస్ ఒరిజినల్ వర్షన్ కు సంబందించిన అన్ని ఇండియన్ భాషల రీమేక్ రైట్స్ సురేష్ బాబు కొనేసినట్టు తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమా రీమేక్ చేస్తారని తెలుస్తుంది. అంతకుముందు కొరియన్ మూవీ మిస్ గ్రానీని కూడా తెలుగులో ఓ బేబీగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు లక్ కీ అనే కొరియన్ మూవీని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో గురు ఫిలింస్, స్క్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగమవుతున్నట్టు తెలుస్తుంది. మరి లక్ కీ కాస్టింగ్ ఎవరు.. డైరక్టర్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష