సునీల్ తో అనసూయ జోడీ..!

January 12, 2021


img

స్టార్ కమెడియన్ సునీల్ ఆమధ్య కెరియర్ లో వెనకపడినట్టు అనిపించినా మళ్లీ వింటేజ్ సునీల్ ను తిరిగి ప్రేక్షకులకు పరిచయం చేశాడు త్రివిక్రం. ఎన్.టి.ఆర్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో చాలా గ్యాప్ తర్వాత సునీల్ కమెడియన్ గా చేశాడు. ఆ తర్వాత వెంటనే చిత్రలహరి కూడా పడ్డది అలా సునీల్ తిరిగి ఫాంలోకి వచ్చేశాడు. అల వైకుంఠపురములో కూడా సునీల్ కు క్యారక్టర్ ను కావాలని పెట్టి నువ్వలా ఉండు చాలు అంటూ తన స్నేహితుడి మీద అభిమానం చూపించాడు త్రివిక్రం.

ఇదిలాఉంటే ఈమధ్య సునీల్ కమెడియన్ గానే కాదు విలన్ వేషాలు వేస్తున్నాడు. సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో సునీల్ విలన్ గా చేశాడు. ఆ సినిమాతో సునీల్ కు మంచి పేరు వచ్చింది. ఇక లేటెస్ట్ గా సునీల్ హీరోగా వేదాంతం రాఘవయ్య సినిమా వస్తుంది. 14 రీల్స్ ప్లస్ రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ కథ అందించారు. ఎస్.ఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సునీల్ సరసన అనసూయ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 

బుల్లితెర మీద తన అందచందాలతో అలరిస్తున్న అనసూయ జబర్దస్త్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షోలో కమెడియన్స్ చేసే స్కిట్స్ తో పాటుగా అనసూయ గ్లామర్ షో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. స్మాల్ స్క్రీన్ పై తనకు వచ్చిన క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుంది. క్షణం నుండి అనసూయ చేస్తున్న ప్రతి పాత్ర కొత్తగా ఉంటుంది. రాం చరణ్ రంగస్థలంలో కూడా రంగమ్మత్త పాత్రలో అమ్మడు అదరగొట్టింది. ఫైనల్ గా సునీల్ తో అనసూయ లక్కీ ఛాన్స్ అందుకుంది. మరి ఈ సినిమాలో అనసూయ ఎలా అలరిస్తుందో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష