కరోనా వార్తలపై స్పందించిన రేణు దేశాయ్..!

January 08, 2021


img

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆమె హోం క్వారెంటైన్ లో ఉంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనోటా ఈనోటా పడి అది కాస్త రేణు దేశాయ్ చెవిన పడ్డది. తనకు కరోనా పాజిటివ్ ఏంటి అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. అలా రాసిన వెబ్ సైట్ స్క్రీన్ షాట్ తీసి ఇలాంటి ఫేక్ సైట్స్.. ఫేక్ న్యూస్ లను అసలు ఎంకరేజ్ చేయొద్దని అన్నారు. అంతేకాదు సెలబ్రిటీల జీవితాల మీద బ్రతికేస్తాయి అంటూ సదరు వెబ్ సైట్ మీద డైరెక్ట్ ఎటాక్ కు దిగారు రేణు దేశాయ్. 

బాధ్యత గల వ్యక్తిగా తనకు కరోనా వస్తే తానే స్వయంగా వెళ్లడిస్తానని. అంతేకాదు కరోనా వచ్చింది అని కామెడీ చేసేంత చిన్న విషయం కాదని రేణు దేశాయ్ అన్నారు. అంతేకాదు ఆ వెబ్ సైట్ ను ఎవరు ఫాలో అవ్వొద్దని ఆమె కోరారు. ఈమధ్యనే తానొక ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ తనకు కరోనా వచ్చింది అన్న వార్త తెలిసిన కొందరు తనని అదోలా చూశారని అన్నారు. మొత్తానికి రేణు దేశాయ్ కు కరోనా అంటూ రాసిన ఆ వెబ్ సైట్ మీద ఆమె తన కోపాన్ని వెళ్ళగక్కారు.





Related Post

సినిమా స‌మీక్ష