బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్..?

December 04, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారాలకు వచ్చేసింది. ప్రస్తుతం 13వ వారం షో నడుస్తుంది. మరో మూడు వారాల్లో షో ముగుస్తుంది. డిసెంబర్ 20న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ జరగనుందని తెలుస్తుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా ఎవరు వస్తారని ఎక్సయిటింగ్ గా ఉన్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ వస్తారని టాక్.

హోస్ట్ గా నాగార్జున ఈసారి మహేష్ ను గెస్ట్ గా ఆహ్వానిద్దామని అనుకుంటున్నారట. నాగార్జున హోస్ట్ గా చేసిన సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇక ఈ సీజన్ కు ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ వస్తారని తెలుస్తుంది. అంతేకాదు మహేష్ తో కూడా నెక్స్ట్ సీజన్స్ లో హోస్ట్ గా చేయించాలని బిగ్ బాస్ నిర్వాహకుల ప్లాన్. మహేష్ హోస్ట్ గా చేస్తానని అనాలే కాని ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వెనకాడరని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష