ఏంటి బంగార్రాజు ఉంటుందా..?

November 24, 2020


img

కింగ్ నాగార్జున మన్మథుడు 2 రిజల్ట్ షాక్ ఇవ్వడంతో చాలా జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోల్మన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న నాగ్ ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాకుండా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. 

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ రవితేజతో తీసిన నేల టిక్కెట్టు ఫ్లాప్ అవగా కెరియర్ లో వెనకపడ్డాడు. నేల టిక్కెట్టు రిజల్ట్ చూసి నాగార్జున కూడా బంగార్రాజు సినిమా క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నారు.. కాని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేసిన బంగార్రాజు ఫైనల్ స్క్రిప్ట్ నాగార్జునకు నచ్చిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందని తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష