పవర్ స్టార్ తో నిధి అగర్వాల్..!

November 23, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. పవన్ 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో నిరాశపరచిన నిధి అగర్వాల్ రామ్ తో నటించిన ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకుంది.  

ఇక ఈ సినిమా తర్వాత గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. పవర్ స్టార్ తో ఛాన్స్ నిధి అగర్వాల్ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష