సర్కారు వారి పాటలో అనుష్క..?

November 22, 2020


img

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న మహేష్ సర్కారు వారి పాటతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సర్కారు వారి పాటలో అనుష్క సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటించే ఛాన్స్ ఉందట.

స్వీటీ అనుష్కతో మహేష్ ఖలేజా సినిమాలో కలిసి నటించారు. అయితే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. సర్కారు వారి పాటలో అనుష్క ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. నిశ్శబ్ధం సినిమా తర్వాత తెలుగులో అఫీషియల్ గా ఒక్క సినిమా కూడా కమిట్ అవలేదు అనుష్క. ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని టాక్. Related Post

సినిమా స‌మీక్ష