అర్హ కోసం అల్లు అర్జున్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

November 21, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కూడా అంతే టైం స్పెండ్ చేస్తారు. బన్నీ తనయుడు అయాన్, కూతురు అర్హలతో షేర్ చేసుకునే స్పెషల్ వీడియోస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాయి. ఇక లేటెస్ట్ తన కూతురు బర్త్ డే సందర్భంగా ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. అంజలి అంజలి కవర్ సాంగ్ లో అల్లు అర్హతో ఓ స్పెషల్ వీడియో కంపోజ్ చేశారు. అల్లు అర్హ నటించిన అంజలి కవర్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

కూతురికి బన్నీ ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ సూపర్ అనేస్తున్నారు మెగా, అల్లు ఫ్యాన్స్. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్నారు. మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష