డిసెంబర్ 20న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్..!

November 20, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. సీజన్ 3 హోస్ట్ గా చేసిన నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4, 16 మంది డైరెక్ట్ కంటెస్టంట్స్, ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాగా ప్రస్తుతం 11వ వారం ఎనిమిది మంది మాత్రమే హౌజ్ లో ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే ఏడుగురు మాత్రమే హౌజ్ లో ఉంటారు.

ఇక బయట ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఎనాలసిస్ చేస్తూ ఎవరు టాప్ 5లో ఉంటారు.. ఎవరు టాప్ 3లో ఉంటారని లెక్కలు వేస్తున్నారు. ఇక కొందరైతే విజేత అతనే అంటూ కూడా చెప్పేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 20న ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ కు స్టార్ హీరో గెస్ట్ గా వస్తాడని తెలుస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం.Related Post

సినిమా స‌మీక్ష