విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్

October 30, 2020


img

 రౌడీ హీరో విజయ్ దేవరకొండ కేవలం సినిమాలతోనే కాదు బిజినెస్ లతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ క్లాతింగ్ క్రేజీగా మారగా.. లేటెస్ట్ గా వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. శుక్రవారం తెలంగాణా ఐటి మినిస్టర్ కే.టి.ఆర్ అధ్వర్యంలో జరిగిన ఎలెక్ట్రిక్ వెహికల్ సమిట్ లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా అంటెండ్ అయ్యారు. అద్దెకు ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను అందించే విధంగా వీటిని ప్రవేశ పెట్టారు. ప్రయాణించే దూరాన్ని బట్టి వారు తగిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ స్కూటర్లు, బైకులు కాలుష్యం తగ్గడంలో సహకరిస్తాయి. ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ అన్నారు.      



Related Post

సినిమా స‌మీక్ష