సుధీర్ బాబుతో పలాస డైరక్టర్ ప్రీ లుక్కు అదిరింది.. సోడా సౌండ్ మోగిపోయేలా..!

October 29, 2020


img

అభిరుచి గల సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బ్యానర్ 70mm ఎంటర్టైన్మెంట్స్. విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మాతలుగా ఇప్పటికే భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలు చేశారు. ఇప్పుడు పలాస 1978తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు.  

ఓ పక్క సోడాల పెట్టే.. లైటింగ్.. కటింగ్ బ్లేయర్ ఈ ప్రాపర్టీస్ తో ప్రీ లుక్ రిలీజ్ చేశారు. పలాస లానే ఈ సినిమా కూడా పిరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. నిమ్మ సోడా.. ఐస్ సోడా.. మసాలా సోడా.. ఇలా అన్ని సోడాలు కలిపి వస్తున్న ఈ సోడా సౌండ్ ఏంటన్నది రేపు సాయంత్రం 4 గంటలకు తెలుస్తుంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ తో రేపు సాయంత్రం సర్ ప్రైజ్ చేయనున్నారు.  పలాస తర్వాత ఆహాలో మెట్రోల్ కథలు వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేశారు కరుణ కుమార్. వి సినిమాలో అదరగొట్టిన సుధీర్ బాబు కరుణ కుమార్ తో చేస్తున్న ఈ సినిమాపై ప్రీ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా టైటిల్ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచనున్నారు.           

 


Related Post

సినిమా స‌మీక్ష