హిమాలయాలకు నాగార్జున..!

October 23, 2020


img

ఓ పక్క బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వైల్డ్ డాగ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. సోల్మన్ డైరక్షన్ లో వస్తున్న వైల్డ్ డాగ్ సినిమా కోసం నాగార్జున హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. మనాలిలో సముద్ర మట్టానికి 3980 మీట‌ర్ల ఎత్తులో అంటే 13వేల ఫీట్లతో డేంజరస్ పాస్ లో షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. 

ఈ ఏడు నెలలు ఇక్కడకు ఎవరిని రానివ్వలేదని.. షూటింగ్ కోసం ఇక్కడ 21 రోజులు ఉంటామని అన్నారు నాగార్జున. అయితే నాగార్జున బదులుగా బిగ్ బాస్ హోస్ట్ గా సమంత వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాన్ని కన్ ఫాం చేస్తూ నాగార్జున ట్విట్టర్ లో వీడియో పెట్టి షూటింగ్ లొకేషన్ వీడియో పెట్టారు. బిగ్ బాస్ హోస్ట్ గా సమంత దాదాపు కన్ ఫాం అయినట్టే అని చెప్పొచ్చు.





Related Post

సినిమా స‌మీక్ష