బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది..!

October 23, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.   

ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అంటూ ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. ట్రైన్ లో రొమాంటిక్ గా స్టిల్ ఇచ్చిన ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ అదిరిపోయింది. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. 2021 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.    




Related Post

సినిమా స‌మీక్ష