శింబు, త్రిష పెళ్ళికి.. అడ్డు పడుతున్నది ఎవరు..?

October 16, 2020


img

కోలీవుడ్ స్టార్ హీరో శింబు సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మూడేళ్ల క్రితం ఒక బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిన త్రిష పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. 96 సినిమాతో తమిళంలో మరోసారి తన సత్తా చాటిన అమ్మడు వరుస సినిమాలు చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా మారింది. ఇక మళ్లీ త్రిష పెళ్ళిపై రకరకాల న్యూస్ లు వస్తున్నాయి.

శింబుతో త్రిష పెళ్లికి రెడీ అంటూ డైరెక్ట్ వార్తలు రాస్తున్నారు. కరోనా లాక్ డౌన్ టైంలో వీరిద్దరు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. అయితే శింబు, త్రిషల పెళ్లికి శింబు ఫాదర్ టి.రాజేందర్ అడ్డు పడుతున్నాడని టాక్. శింబుకి త్రిషను పెళ్లాడాలని ఉన్నా కూడా రాజేందర్ వద్దని చెబుతున్నాడట ఆయన్ను ఒప్పించి త్రిషతో పెళ్లికి రెడీ అవ్వాలని చూస్తున్నాడు శింబు. త్రిష మాత్రం శింబు ఎప్పుడంటే అప్పుడు పెళ్లికి రెడీ అంటుందట. మరి శింబు, త్రిష నిజంగానే పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష