ఆచార్య కోసం రాం చరణ్..!

September 23, 2020


img

కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఆచార్య కోసం టైం కేటాయిస్తున్నాడు చరణ్. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళనున్న ఆచార్య సినిమా కోసం ప్రస్తుతం చరణ్ లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తుంది. ఆచార్య లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందని టాక్.

సినిమాలో రాం చరణ్ పాత్ర 40 నిమిషాల దాకా ఉంటుందని అంటున్నారు. ఆచార్యలో చరణ్ సరికొత్త పాత్రతో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. చిరు, చరణ్ ఒకే సినిమాలో నటించి మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వనున్నారు. సినిమాలో కాజల్ చిరుకి జోడీ కడుతుండగా రాం చరణ్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

 


Related Post

సినిమా స‌మీక్ష