కార్తికేయ 'చావు కబురు చల్లగా' టీజర్.. మాస్ ఎంటర్టైనర్..!

September 21, 2020


img

ఆరెక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా కౌశిక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసి నిర్మిస్తున్నారు. ఈరోజు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంది. మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో కార్తికేయ ఈ సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. చూస్తుంటే కార్తికేయ ఈసారి సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. ఆరెక్స్ 100 హిట్ తర్వాత హిప్పీ, గుణ 369 చేసిన కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కూడా మెప్పించాడు. ఆ తర్వాత 90 ML సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు. కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా అతని కెరియర్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  

Related Post

సినిమా స‌మీక్ష