సంక్రాంతికి వకీల్ సాబ్..?

September 19, 2020


img

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. శృతి హాసన్, నిఏదా థామస్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరో 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండగా త్వరలోనే అది పూర్తి చేసి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 

తెలుస్తున్న సమాచారం ప్రకారం 2021 సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ ను రిలీజ్ చేస్తారని అంటున్నారు. జనవరి 14న వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడట దిల్ రాజు. త్వరలోనే థియేటర్లు తెరచుకునే అవకాశం ఉందని.. 2021 సంక్రాంతి కల్ల పరిస్థితి అదుపులో వచ్చే అవకాశం ఉంటుందని దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ డేట్ ను సంక్రాంతికి ఫిక్స్ చేశారు. మరి అనుకున్నట్టుగా వకీల్ సాబ్ సంక్రాంతి రేసులో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే అఖిల్ బ్యాచ్ లర్ పొంగల్ రిలీజ్ ఎనౌన్స్ చేయగా నితిన్ రంగ్ దే కూడా సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.Related Post

సినిమా స‌మీక్ష