అల్లు అర్జున్ పై కేసు నమోదు..!

September 17, 2020


img

రీసెంట్ గా అల్లు అర్జున్ ఆదిలాబాద్, మహారాష్ట్ర బోర్డర్ లో కుంతల జలపాతం సందర్శించిన విషయం తెలిసిందే. తిప్పేశ్వరం లో కూడా అల్లు అర్జున్ టీం షూటింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ ను ఇబ్బందుల్లో పడేసింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ పై ఫిర్యాదు చేశారు అక్కడ స్వచ్చంద సేవా సంస్థ. అక్కడ పరిసరాలను విహరించడానికి అనుమతి లేదు అయినా కూడా అల్లు అర్జున్ అండ్ టీం అక్కడకు వచ్చి షూటింగ్ చేశారని కేసులో పేర్కొన్నారు.          

అనుమతి లేకుండా రావడమే కాకుండా తిప్పేశ్వరంలో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా షూటింగ్ కూడా చేశారని సమాచార హక్కు సాధన సమితి ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఫిర్యాదు చేశారు. బన్నీ టీం తిప్పేశ్వరంలో షూటింగ్ చేయలేదని కేవలం లొకేషన్ ఫోటోలు మాత్రమే తీశారని తెలుస్తోంది. మరి ఈ కేసు విషయమై అల్లు అర్జున్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష