చిరు అంత తీసుకుంటున్నాడా..!

August 12, 2020


img

పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా సరే మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న చిరు ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమా చేశాడు. ఆ సినిమాతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నారు చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం చిరు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.     

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఆచార్య సినిమాకు చిరంజీవి 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పటి స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా స్టార్ రెమ్యునరేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అందరు స్టార్స్ పాతిక నుండి 30 కోట్లు తీసుకుంటుంటే చిరు మాత్రం సినిమాకు 50 కోట్ల దాకా వసూళు చేస్తున్నాడట. 60 ప్లస్ లో కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తున్న చిరు సినిమా వసూళ్లతోనే కాదు రెమ్యునరేషన్ లో కూడా తన తర్వాతే ఎవరైనా అనుకునేలా చేస్తున్నాడు.

 


Related Post

సినిమా స‌మీక్ష