రూమర్స్ కు చెక్ పెట్టిన నాని

August 11, 2020


img

జెర్సీ తర్వాత నాచురల్ స్టార్ నాని V సినిమాతో ప్రేషకుల ముందుకు రాబోతున్నాడు. Vలో నాని నెగటివ్ రోల్ చేశాడని తెలిసిందే. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నది చెప్పలేం. ఇక ఈ సినిమా తర్వాత నాని నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాని మానసిక సమస్యతో బాధపడే పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.       

టక్ జగదీష్ సినిమాపై వచ్చిన ఈ రూమర్స్ ను ఖండించారు నాని. ఆ సినిమాలో తన పాత్ర అది కాదని క్లారిటీ ఇచ్చారు. వి తర్వాత టక్ జగదీష్ షూటింగ్ లో పాల్గొననున్న నాని ఆ సినిమా తో పాటుగా శ్యామ్ సింగ రాజ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యామ్ సింగ రాయ్ సినిమా వస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష