ఎస్పి బాలుకి కరోనా పాజిటివ్

August 05, 2020


img

టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. రాజమౌళి, తేజ, పృధ్వి రాజ్, సింగర్ స్మితలకు కరోనా పాజిటివ్ వచ్చిందని వారు స్వయంగా వెళ్ళడించగా లేటెస్ట్ గా లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కు కరోనా వచ్చిందని తెలుస్తుంది. కొద్దిరోజులుగా జ్వరం వచ్చిపోతుందని.. జలుపు దగ్గుతో ఆయన బాధపడుతున్నట్టు తెలిపారు. అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారట. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని బాలు స్వయంగా వీడియో ద్వారా వెళ్ళడించారు. 

ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు బాలు. డాక్టర్స్ కూడా హోం క్వారెంటైన్ ఉండాలని సలహా ఇచ్చారు. ఇక తనకు కరోనా పాజిటివ్ అనగానే చాలా మంది ఫోన్ చేస్తున్నట్టు తెలిపారు బాలు. అభిమానులు, శ్రేయొభిలాషులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు బాలు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని అనారు బాలు. చెన్నైలోని చూలాయిమేడు హాస్పిటల్ లో బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. వీడియోలో ఆయన 100 % ఐయాం ఆల్రైట్ అంటున్నారు.. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.    

View this post on Instagram

Thanks for your prayers ...

A post shared by SP Balasubrahmanyam (@ispbofficial) on
Related Post

సినిమా స‌మీక్ష