వాళ్ళతో పూజా చేయదట..!

August 04, 2020


img

బుట్ట బొమ్మ పూజా హెగ్దే కోసం టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. స్టార్ హీరో సినిమా అంటే చాలు ముందు పూజా హెగ్దేని అడిగిన తర్వాతే వేరే హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్దే ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. ప్రభాస్ తో రాధే శ్యాం సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల తర్వాత చేస్తే స్టార్స్ తోనే చేస్తా అంటుంది పూజా హెగ్దే. 

రీసెంట్ గా యువ హీరో నితిన్ చేస్తున్న అందాదున్ రీమేక్ లో పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కాని పూజా మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరితో నటించిన నితిన్ పక్కన ఛాన్స్ వచ్చినా కాదనేసింది పూజా హెగ్దే. డేట్స్ అడ్జెస్ట్ అవకనే నితిన్ ఆఫర్ వదులుకుందని పైకి కవర్ చేస్తున్నా అమ్మడు చేస్తే స్టార్స్ తోనే తప్ప మీడియం రేంజ్ హీరోలతో చేసే ఆలోచనలో లేదట. పూజా హెగ్దే నిర్ణయంపై యువ హీరోలు అసంతృప్తిగా ఉన్నారు.



Related Post

సినిమా స‌మీక్ష