సింగర్ స్మితకు కరోనా..!

August 04, 2020


img

తెలుగు పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెళ్ళడించారు. బాడీ పెయిన్స్ ఉండటంతో హెవీ వర్కవుట్స్ వల్ల అని భావించగా ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందట. తనకు తన భర్త శశాంక్ కు కరోనా బారిన పడినట్టి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు స్మిత. అయితే లక్షణాలు ఏమి లేవని.. త్వరలోనే కరోనా నుండి మేము బయటపడతామని ఆమె అన్నారు. కరోనా నుండి బయట పడ్డాక ప్లాస్మా దానం చేస్తామని అన్నారు.     

తాము ఇంట్లో ఉన్నా సరే కోవిడ్ తమ ఇంటికి వచ్చిందని అన్నారు స్మిత. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులలో రాజమౌళికి అతని ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ అని తేలగా.. డైరక్టర్ తేజ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ప్రకటించారు. ఈరోజు పృధ్వి రాజ్ కూడా హోం క్వారెంటైన్ లో ఉంటున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాజాగా స్మిత కూడా తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. కరోనా బారిన పడ్డ వారు కొందరు అది బయటకు చెప్పేందుకు భయపడుతున్నారు. కొందరు తమకు పాజిటివ్ వచ్చినా నిర్లక్ష్యంగా జన సమూహంలో తిరుగుతున్నారు. అలాంటి వారు కనీసం సినీ సెలబ్రిటీస్ ను చూసైనా సరే మారితే బాగుంటుంది.

Related Post

సినిమా స‌మీక్ష