ఏజెంట్ ఆత్రేయ సీక్వల్ వస్తుందా..?

August 03, 2020


img

యువరక్తం ఉరకలేస్తున్న తెలుగు సినీ పరిశ్రమలో కొత్త వారు వాళ్ళ అద్భ్హుతమైన టాలెంట్ తో మెప్పిస్తున్నారు. కొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ దర్శకులు అదిరిపోయే కంటెంట్ తో వస్తున్నారు. కంటెంట్ లో సత్తా ఉండాలి కాని చిన్న సినిమాలతో అద్భుతాలు సృష్టించ వచ్చని ప్రూవ్ చేస్తున్నారు. ఈ సినిమాలకు భారీ బడ్జెట్ అవసరం లేదు.. స్టార్ హీరోలు అక్కర్లేదు.. కరెక్ట్ కంటెంట్ తో వస్తే తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే వస్తుంది.       

లాస్ట్ ఇయర్ వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. స్వరూప్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. కొత్త కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు. డైరక్టర్ స్వరూప్ ప్రస్తుతం వేరే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఆత్రేయకు సీక్వల్ సినిమా చేస్తారని తెలుస్తుంది. సీక్వల్ గా ఒక సినిమా కాదు ఆత్రేయ పార్ట్ 2, 3 కూడా ఉంటుందని అన్నారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాత రాహుల్. Related Post

సినిమా స‌మీక్ష