మారుతి.. నాని.. భలే భలే..!

August 03, 2020


img

సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి.. సక్సెస్ ఫుల్ హీరో నాని కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భలే భలే మగాడివోయ్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అదుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని వరుస విజయాలతో దూసుకెళ్లాడు. ఇక మారుతి కూడా డైరక్టర్ గా తన మీద ఉన్న బూతు ముద్రని చెరిపేసుకున్నాడు.

లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండగే సినిమాతో మెగా హీరోతో హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ లాక్ డౌన్ టైం లో ఒకటి రెండు కథలు సిద్ధం చేసిన మారుతి మరోసారి నాని హీరోగా సినిమా చేస్తాడని తెలుస్తుంది. నాని, మారుతి కాంబో అనగానే భలే భలే అనేయడం ఖాయం. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యాం సింగ రాయ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత మారుతి సినిమా ఉంటుందని చెప్పొచ్చు. మారుతితో నాని ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష