ఫైనల్ గా శృతికి ఫిక్స్ అయ్యారు..!

August 01, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరో రెండు వారాలు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుందట. సినిమాలో నివేదా థామస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే సినిమాలో పవన్ సరసన నటించేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.

కొన్నాళ్ళుగా శృతి హాసన్ వకీల్ సాబ్ హీరోయిన్ అని వార్తలు వస్తున్నా.. ఆమె మాత్రం ఆ సినిమా చేయట్లేదని చెప్పింది. అయితే డైరక్టర్ వేణు శ్రీరాం మాత్రం వకీల్ సాబ్ హీరోయిన్ శృతి హాసనే అని కన్ఫర్మ్ చేశారు. మధ్యలో ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా మళ్ళీ వకీల్ సాబ్ లో శృతి హాసనే హీరోయిన్ అని అంటున్నారు. పవన్ సరసన గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో శృతి హాసన్ జతకట్టింది. మరి హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ వకీల్ సాబ్ ఎలా ఉంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష