బన్నీతో కొరటాల శివ.. ఎనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది..!

July 30, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ శుక్రవారం వస్తుందని తెలుస్తుంది. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో బన్నీ స్టూడెంట్ లీడర్ గా నటిస్తాడని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో సోషల్ మెసెజ్ ఇస్తూ కమర్షియల్ హిట్ కొడుతున్న కొరటాల శివ చిరుతో ఆచార్య, బన్నీతో మరో సినిమాతో ఫుల్ ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష