వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..!

July 11, 2020


img

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న రాం చరణ్ ఆ సినిమా ఏ డైరక్టర్ తో చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ట్రిపుల్ ఆర్ సినిమా 2021 మిడిల్ వరకు పట్టేలా ఉంది. ఇక ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తాడని లేటెస్ట్ టాక్. వంశీ పైడిపల్లితో రాం చరణ్ ఎవడు సినిమా చేశాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటించాడు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని తెలుస్తుంది.

మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి మహేష్ తోనే మరో సినిమా చేస్తాడని అనుకున్నారు. కాని మహేష్ సినిమాకు చెప్పిన లైన్ బాగున్నా ఫుల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో మహేష్ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడు. అందుకే వంశీ వేరే హీరోని ప్రయత్నించాల్సి వచ్చింది. లేటెస్ట్ గా చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేసిన వంశీ పైడిపల్లి లైన్ చెప్పగా వంశీతో సినిమా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష