రికార్డుల రారాజు..!

July 11, 2020


img

యంగ్ రెబల్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి సినిమా రిలీజ్ వరకు రికార్డుల హంగమా ఉండాల్సిందే. కొన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్న ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. రాధే శ్యామ్ గా ప్రభాస్, పూజా హెగ్దె వస్తున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ 24 గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్స్ తో రికార్డ్ సృష్టించింది. సింగిల్ హ్యాష్ ట్యాగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది రాధే శ్యామ్.     

కృష్ణంరాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. బాహుబలి తర్వాత సాహో సినిమా చేసిన ప్రభాస్ ఆ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పించాడు కాని తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక రాధే శ్యామ్ తో అయినా అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష