చైతు, సమంత మళ్లీ మళ్లీ..!

June 29, 2020


img

నాగ చైతన్య, సమనంతలు కలిసి మరో సినిమా చేయబోతున్నారట. ఏమాయ చేసావే సినిమాలో కలిసి నటించి కలిసి జీవితాన్ని కూడా పంచుకున్న ఈ లవ్ కపుల్స్ ఇప్పటికే ఐదు సినిమాల దాకా కలిసి నటించారు. లాస్ట్ ఇయర్ వచ్చిన మజిలీ సినిమాలో కూడా చైతు, సమంతల జోడీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంకీమామతో కూడా హిట్టు కొట్టాడు నాగ చైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న చైతు ఆ తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ చైతుకి వినిపించడం.. ఓకే చెప్పడం అంతా జరిగిందట. ఈ సినిమాలో హీరోయిన్ గా మళ్లీ సమంతను తీసుకుంటున్నారని తెలుస్తుంది. చైతు, సమంత ఎన్నిసార్లు జతకట్టినా సరే చూడాలని అనిపిస్తుంది. ప్రస్తుతం కెరియర్ లో మంచి ఫాం లో ఉన్న నాగ చైతన్య, సమంతలు మరోసారి జోడీ కడుతున్న ఈ సినిమా కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు థ్యంక్యూ అనే టైటిల్ పరిశీలణలో ఉందట.Related Post

సినిమా స‌మీక్ష